నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లు తయారైంది ఇప్పటి నాయకుల పరిస్థితి..ఏమి మాట్లాడుతున్నారో,ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు..ఏదో ఒక మాట అనడం, తర్వాత నా మాటల ఉద్దేశ్యం అది కాదు అని తప్పును ఒప్పుకోవడం ఇదంతా ఇప్పుడు ట్రెండ్ అయింది..తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అలజడి సృష్టించాయి..బీఆరెస్ నాయకులు కేటీఆర్ ను ఏదో అనబోయి తానే చిక్కుల్లో చిక్కుకుంది..
కేటీఆర్ కు సినిమా హీరోయిన్లు అంటే పిచ్చి అని వాళ్ల జీవితాలను నాశనం చేస్తాడని మాట్లాడి సినీ ఇండస్ట్రీ ఆగ్రహానికి గురైంది..తాను ఒక మహిళ అని మరిచిపోయి మరో మహిళ గురించి మాట్లాడి ఉన్న పరువును కోల్పోయింది..ఈ వివాదం లోకి అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, సమంత ను లాగి ఒక్క సారిగా విమర్శలకు గురైంది..రాజకీయంగా ఏదో చేయబోయి అందరితో ఇప్పుడు మాటలు పడుతుంది సదరు మంత్రి..
మంత్రి సురేఖ వ్యాఖ్యల పై నాగార్జున,సమంత,నాగ చైతన్య తో పాటు సినీ తారలందరు ఆగ్రహం వ్యక్తం చేశారు..ఒక మహిళ పై , ఒక హీరో కుటుంబం పై అలాంటి మాటలు మాట్లాడటం ఏంటని తీవ్రంగా ఖండించారు.. రాజకీయ జీవితాలలోకి మమ్మల్ని లాగటం ఏంటని ప్రశ్నించారు..సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఇంత చిన్న చూపా అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక్కసారి ట్రోల్స్ రావడం తో కొండ సురేఖ డిఫెన్స్ లో పడింది..మరో పక్క కేటీఆర్ కూడా సురేఖ వాఖ్యలను ఖండించారు.. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు..రాజకీయాల కోసం ఇలాంటి బురద చల్లడం ఇవన్నీ చిల్లర రాజకీయాలంటూ ఘాటుగా స్పందించారు..
సమంత పై చేసిన వాఖ్యలతో ఇంటా బయటా విమర్శలు రావడంతో తన వాఖ్యలను వెనక్కుతీసుకుంటునట్టు మంత్రి ప్రకటించారు..అయితే ఇదంతా చూస్తున్న జనం మంత్రిని నానా బూతులు తిడుతున్నారు..ఒక మహిళ మంత్రి గా నీ రాజకీయాల కోసం మరో మహిళపై అలా మాట్లాడటం ఏంటని ట్రోల్ చేస్తున్నారు..మొత్తానికి సమంత ఎపిసోడ్ కొండ సురేఖ రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయింది..