youtube…
సాధించాలనే తపన ఉంటే ఎంతటి అసాద్యానైన సుసాద్యం చేయచ్చని నిరూపించారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర..అటవీ ప్రాంతంలో గిరిజన పిల్లలు చదువుకోవాలంటే పాఠశాల ఉండాలి…ఉన్న పాఠశాలేమో శిథిలావస్థలో ఉన్న ఒక గుడిసె లో నడుస్తుంది..ఇద్దరు సిబ్బంది ఉన్నారు..ఈ సమస్యలను స్థానిక తండా వాసులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు..మాకు ఒక స్కూల్ కావాలని అడిగారు..కానీ అది పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో అటవీ శాఖ నుండి పాఠశాల నిర్మాణానికి అనుమతులు రావు..దీంతో వినూత్నంగా ఆలోచించి కలెక్టర్ దివాకర తన నిధుల నుండి 13 లక్షలు ఖర్చు చేసి మరీ విద్యార్థుల కోసం ఒక పాఠశాల ను నిర్మించారు..అయితే ఈ స్కూల్ ను అన్ని స్కూళ్లలాగ నిర్మించలేదు..పర్మినెంట్ బిల్డింగ్ కాకుండా ఎక్కడికంటే అక్కడికి షిప్ట్ చేసే కంటేయినర్ స్కూల్ ను ఏర్పాటు చేశారు..
ఈ కంటెయినర్ పాఠశాల ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గొత్తికోయగుంపు అటవీ ప్రాంతంలో ఉంది..ఈ నెల 17 న ఈ కంటెయినర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించడంతో ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది…ఈ కంటెయినర్ స్కూల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంది..దీంట్లో 12 వరకు డ్యూయల్ డెస్కులు ఉన్నాయి…ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి 3 కుర్చీలు పట్టే స్థలం కూడా ఉంది..తెలంగాణలోనే తొలి కంటైనర్ స్కూల్ ములుగు లోనే నిర్మించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ స్కూల్ పై పడింది..విద్యార్థుల భవిష్యత్ కోసం వినూత్నంగా ఆలోచించి ఇలాంటి స్కూల్ ను ఏర్పాటు చేసిన కలెక్టర్ ను అందరూ అభినందిస్తున్నారు.