ఎంతో ఇష్టపడి కొనుకున్న వస్తువు పాడైతే ఏం చేస్తాం..దానికి సంబందించిన సంస్థ వద్దకు తీసుకెళ్లీ రిపేర్ చేయించి తిరిగి వాడుకుంటాం..ఒకవేళ మనం ఎంత చెప్పిన సదరు సంస్థ మనం చెప్పిన సమస్యలను పట్టించుకోకుంటే కోపం కట్టలు తెంచుకుని ఆవేశంతో ఊగిపోతాం కదా..ఇప్పుడు ఓ కస్టమర్ అదే పనిచేశారు..
ఎంతో ఇష్టంగా కొనుకున్న ఓలా స్కూటి ప్రతిసారీ ఇబ్బందిపెడుతుంటే, ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన ఆ సంస్థ స్పందించకపోవడంతో ఓ యువతి వినూత్నంగా తన నిరసనను తెలిపింది..ఎవరు ఈ సంస్థ బైక్ లను కొనకండి..సర్వీస్ బాగా లేదంటూ తన స్కూటికి ఓ పేపర్ ను అంటించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది..
ఓలా సంస్థ వాహనాల పై వరుసగా ఎన్నో కంప్లైట్లు వస్తున్నాయి..రీసెంట్ గానే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓలా బైక్కు మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదని కలబురగిలో వినియోగదారుడు షోరూం కు నిప్పు పెట్టిన విషయం దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే..తాజా గా మళ్లీ అదే సంస్థ పై మరో కష్టమర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో ఓలా స్పందించింది..వాహనాన్ని రిపేర్ చేసేందుకు తీసుకువెళుతూ, అప్పటి వరకు నడుపుకొనేందుకు ఆమెకు తాత్కాలికంగా ఒక వాహనాన్ని అందించి వెళ్లారు..కంప్లైంట్ ఇచ్చినపుడే స్పందించి ఉంటే సంస్థ పరవు పోయేది కాదు కదా అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా లో కామెంట్లు పెడుతున్నారు..