చిన్న నటుడైన సరే వచ్చి ఇండస్ట్రీ లో సెటిల్ అయితే తన పేరు చెప్పుకుని సినీ ఫీల్డ్ కు వచ్చే వారు ఎంతో మంది..మావాడు పలానా సినిమాలో నటించాడు,గొప్ప నటుడు మాకు అవకాశం ఇవ్వండి అంటూ తిరిగేవారు ఎందరో..ఇలా తిరిగి అవకాశాలు వచ్చినా వాటిని నిలదొక్కుకోలేక నిట్ట నిలువునా మునిగిన వారెందరో..ఎంతో మంది స్టార్ హీరోల తనయులు, అగ్ర డైరెక్టర్ ల పుత్ర రత్నాలు బిల్డ్ అప్ ఇచ్చి తుస్ మని సినీ ఫీల్డ్ లో కనుమరుగయ్యారు..అవుతూనే ఉన్నారు..
నార్నే నితిన్ తండ్రి వ్యాపార రంగం లో పేరు మోసిన మోతేబరి..బావ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ద బిగ్ షాట్..కానీ ఏ రోజు తన బ్యాక్ రౌండ్ ని వాడుకొని ఇండస్ట్రీ కి రాలేదు నితిన్..అలానే కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయు మేము సపోర్ట్ ఉంటాం..టాలెంట్ ఉంటే నిలదొక్కు కుంటావ్ లేదంటే లేదని తెగేసి చెప్పారు తప్పా..లేని పోనీ ఆర్భాటాలకు పోయి పొగరును నితిన్ మెడదులోకి ఎక్కియ్యలేదు..జూనియర్ ఎన్టీఆర్ ఏనాడు లేనిపోని స్టార్ డామ్ ఫేమ్ తన బావమరిది దగ్గరికి రానియ్యలేదు..నీ దారి నీదే నేను తోడుంటా..కష్టం నీది ఫలితం నీది అని సపోర్ట్ ఇచ్చాడు తప్పా..అతనికి అనవసరపు హంగులను నేర్పలేదు..
నార్నే నితిన్ మొదటి సినిమా ‘మ్యాడ్’ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకున్నాడు…ఆ సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా కూడా ఎవరు ఊహించని విదంగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.సరదాగా సాగిపోతూ మంచి వసూళ్లను రాబట్టింది..మొదటి సినిమా హిట్ తోనే నితిన్ అందరిలా ఆలోచించలేదు..ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు పోతున్నాడు..మ్యాడ్ సినిమా హిట్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న నార్నే నితిన్ ‘ఆయ్ ‘ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ మరో సారి నితిన్ కు కలసి వచ్చింది..అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు..చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఆయ్’ సూపర్ హిట్ గా నిలిచింది. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ సుమారు రూ. 20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.ఆగస్ట్ లో స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఆయ్ సినిమా ఇలాంటి కలెక్షన్లు రాబట్టడం విశేషం…ఇలా వరుస సినిమా హిట్ల తో నార్నే నవీన్ ఇండస్ట్రీ లో దూసుకుపోతున్నాడు..ఇలానే సినిమాలను ఎంచుకొని నితిన్ మరింత ఎత్తుకు ఎదగాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు..