వర్షాలు ఎప్పుడు ఆగుతాయో దేవుడా అనుకుంటూ ప్రజలు మొక్కుకుంటున్నారు..ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వానలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు..ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉంటాయో ప్రజలందరు గమనించారు..వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను ప్రళయం సృష్టించాయి..ఉన్న ఊరిని కట్టుకున్న ఇంటిని వదిలి వందలాది కుటుంబాలు పునరావాస కేంద్రాలలో తలదాచుకున్నాయి..ప్రకృతి కోపం ఎలా ఉంటుందో ఎంతో మంది కళ్ళ చూశారు..గత రెండు వారాలుగా తెలుగు ప్రాంతాలను వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..అటు ఆంధ్ర,ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడి వాగులు వంకలు పొంగి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.. మరెందరో వరదల్లో కొట్టుకుపోయారు..ఇప్పుడిప్పుడే ఈ వాన తగ్గేలా లేదు..తాజాగా వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి వార్తను తెలిపింది..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. IMD ప్రకారం వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,ఒడిశా లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది..గడచిన 24 గంటల్లో రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రానున్న ఏడు రోజుల పాటు వాతావరణం ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది.
సెప్టెంబర్ 8, 9 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ IMD వెల్లడించింది..ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో సతమవుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరిక తో మరింత ఆందోళన చెందుతున్నారు..