వెర్రి వెయ్యి రకాలు అంటారు అలానే తయారైంది నేటి యువత పరిస్థితి.చేతిలో ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేస్తూనో, యూ ట్యూబ్ లో వీడియో చేస్తూనో కాలం గడుపుతున్నారు.వారు చేసేవి సమాజానికి పనికచ్చేవి అయితే బాగానే ఉంటుంది.కానీ శ్రుతి మించితేనే ఇబ్బందిగా మారుతోంది. ఈ మధ్య రీల్స్ పిచ్చి లో పడి ప్రాణాలు సైతం తీసుకున్న విషయాలు అనేకం చూసాం.తెలిసో తెలియకో వ్యూస్ కోసం ఒక్కోక్కరు ఒక్కోలా చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.ఇటీవలే ట్రాఫిక్ లో డబ్బులు చల్లుతూ రీల్స్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అలానే చాలా మంది తొందరగా పాపులర్ అవ్వాలని ఏమేమో చేస్తూ నవ్వుల పాలవుతున్నారు..
టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటారు.మంచిని మంచిలా చెప్పడం చెడును చెడులా చెప్పడం తన నైజాం.ఇప్పుడు ఎక్స్ లో తను షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.ఒక యువకుడిని మందలిస్తూ సజ్జనార్ ఆ వీడియో ను పోస్ట్ చేశారు..
ఎవరో ఒక వ్యక్తి కి సోషల్ మీడియాలో మరో వ్యక్తి ఒక చాలంజ్ విసిరారు.ఆర్టీసీ బస్సును ఆపి వెంటనే పరుగెత్తాలి అని ఛాలెంజ్ విసిరారు.దీనికి సదరు యూ ట్యూబర్ ఓకే అని రిప్లై ఇచ్చి అటుగా వెళ్తున్న పల్లె వెలుగు బస్ ను ఆపుతాడు. బస్ ఆగాక ఎక్కినట్టే ఎక్కి పరుగెడుతాడు.దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో వదిలాడు సదరు యువకుడు..ఈ వీడియో పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు..
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు.లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి…అంటూ సజ్జనార్ ఆ వీడియో ను ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు..