బిగ్ బాస్ ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది..కుటుంబ సభ్యులను మూడు గ్రూపులుగా విభజించి గేమ్ ఆడించిన బిగ్ బాస్.. ఇంటి సభ్యుల మధ్య మరో కొత్త కుంపటి పెట్టాడు..ముగ్గురు చీఫ్ లను పెట్టి గేమ్ ఆడించిన ఆటలో యాస్మి టీం విన్ అయింది..దీంతో ముగ్గురు చీఫ్ లను కన్ఫెక్షన్ రూంలోకి పిలిచి, గెలిచిన యష్మి టీం మిగతా వారితో ఏం పని చేయించాలో నిర్ణయించుకోమని చెప్పారు..మీ టీం కూడా చేస్తే పనులు చేయచ్చు అది మీ ఇష్టం అంటూ యాస్మి కి బంపర్ ఆఫర్ ఇచ్చారు..దీంతో యష్మి తెలివిగా నిఖిల్ టీం కు కేవలం వంట పని మాత్రమే అప్పగించి, సీత టీం కు మిగత అన్ని పనులు అప్పగించింది..
యష్మి చేసిన పనికి సీత,విష్ణు ప్రియ అసహనం వ్యక్తం చేశారు..అందరి పని 6 గురు చేయడం ఏంటని విష్ణు మొహం మాడ్చింది.. కానీ యష్మి టీమ్ సభ్యులు ఇక్కడే తమ లోని మరో కోణాన్ని బయటపెట్టారు.ఇది గేమ్ అంటూ బిగ్ బాస్ తమకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటు సీత టీం ను ఇబ్బంది పెట్టారు..చెత్తను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం,డస్ట్ బిన్ లో వేసిన కూల్ డ్రింక్ బాటిల్ ను తిరిగి బయటపెట్టి వాల్లే పడేస్తారు లే అంటూ నవ్వుకుంటూ పోవడం తో సీత ఆగ్రహం వ్యక్తం చేసింది..మరో వైపు అభయ్ అనవసరంగా సితతో మాట మాట పెంచుకొని కొంచెం నెగటివ్ అయ్యాడు..
వంట నేను వండుకుంటా గిన్నెలు నేను కడగా అంటూ అభయ్ సీత కి చెప్పాడు..మీరు తిన్న ప్లేట్లు మేమెందుకు కడుగుతామంటూ సీత అభయ్ తో గొడవ పడింది.. ఇది గేమ్ మాకు అవకాశం ఉంది కాబట్టి వాడుకుంటున్నామంటూ అభయ్ సీత తో గట్టిగా మాట్లాడటం,సీత టీం సభ్యులు గొడవ పడటం తో టాపిక్ కొంచెం హీటెక్కింది..దమాక్ ఉందా అంటూ అభయ్ మాట్లాడిన తీరుతో కిరాక్ సీత తినడం మానేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది…