Trending Now
Sunday, November 24, 2024

Buy now

Trending Now

స్పీకర్ నిర్ణయం పై ముగ్గురు ఎమ్మెల్యే ల భవితవ్యం..

తెలంగాణ లో ఇప్పుడు రాజకీయం మళ్ళీ వేడెక్కింది.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ల పై అనర్హత వేటు వేయాలంటూ బీఆరెస్ నాయకులు హై కోర్ట్ లో పిటిషన్ వేయడం తెలిసిందే.. దీని పై సోమవారం న్యాయస్థానం తీర్పు నిచ్చింది..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యే లు తమ పరిస్థితి ఇలా అయ్యింది ఏంటని తలలు పట్టుకుంటున్నారు..

తెలంగాణ రాష్ట్రం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ నుండి గెలిచి తరవాత కాంగ్రెస్ పార్టీ లోకి చేసిన ఎమ్మెల్యే లు దానం నాగేందర్, కడియం శ్రీహరి ,తెల్లం వెంకట్రావు పై బీఆరెస్ ఎమ్మెల్యే లు హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే..దీని పై సోమవారం హై కోర్ట్ తీర్పు నిచ్చింది..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. లేదంటే సుమోటో కేసుగా విచారిస్తామన్న హైకోర్టు తేల్చి చెప్పింది..

ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడా అని సర్వత్రా అందరు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ల పై అనర్హత వేస్తే మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది..దీంతో బీఆరెస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే లకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది..హై కోర్ట్ నాలుగు వారాల టైం ఇవ్వడంతో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ నడుస్తోంది..

ముఖ్యంగా అందరి దృష్టి ఇప్పుడు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం మీద పడింది..ఒక వేళ అనర్హత వేటు పడితే ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుంది అంటూ నాయకులు జోరుగా చర్చించుకుంటున్నారు..కడియం బీఆరెస్ నుండి కాంగ్రెస్ లోకి చేరే సమయంలో ఇదే తన చివరి ఎన్నికంటూ చెప్పుకచ్చారు..మరి ఇపుడు అనర్హత వేటు పడితే పోటీ చేస్తాడా లేడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. మరో వైపు ఇందిర రూపంలో కడియం కు ప్రమాదం పొంచి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీహరి పై ఇందిరా స్వల్ప తేడాతో ఓడిపోయింది…గెలిచిన అనంతరం కడియం కాంగ్రెస్ లోకి రావడాన్ని ఆమె వ్యతిరేకించింది..దీంతో కడియం పై అనర్హత వేటు పడి ఉప ఎన్నిక అనివార్యం అయితే ఇందిరా ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు
కోసం పోటీలో ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి..

మరో వైపు కేసీఆర్ కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ను కాదని కడియం కు సీట్ ఇస్తే..ఎమ్మెల్యే గా గెలిచాక తన స్వార్థం కోసం శ్రీహరి పార్టీ మారారని బీఆరెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం ఉన్నాయి..పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే స్టేషన్ గణపూర్ లో ఎలాగైనా గెలిచి తీరాలని బీఆరెస్ అధిష్టానం భావిస్తూ న్నట్లు తెలుస్తోంది..దీని పై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రాజయ్య కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అందుకే రాజయ్య కూడా నియోజకవర్గం లో మళ్లీ ఆక్టివ్ గా ఉంటున్నారని తెలుస్తోంది..దీంతో కడియం శ్రీహరి భవితవ్యం స్పీకర్ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు..

Related Articles

Stay Connected

58,755FansLike
85,858FollowersFollow
155,575SubscribersSubscribe

Most Popular