youtube
ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న పేరు అతిషి..ఈమె ఎవరు, బ్యాక్ రౌండ్ ఏంటి అని నెట్టింట్ల తెగ వెతికేస్తున్నారు..ఢిల్లీ మధ్యం విధానంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ,ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు..విడుదలయ్యాక సంచలన ప్రకటన చేశారు..తన ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి మంగళవారం తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందించారు..ఎప్పుడైతే కేజ్రీవాల్ రాజీనామా చేసి తన వారసురాలిగా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి గా అతిషి ని ప్రకటించారో అప్పడి నుండి ఎవరు ఈ అతిషి అంటూ తన గురించి నెటిజన్లు వెతకడం ప్రారంభించారు..
1981 జూన్ 8 న ఢిల్లీలో అతిషి జన్మించారు..తన స్కూలింగ్ అంతా డిల్లీలోనే పూర్తిచేసింది..ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ట్స్ ను కంప్లీట్ చేసిన తరువాత మధ్యప్రదేశ్ లోని చిన్న గ్రామంలో గడుపుతూ ప్రజల సమస్యల గురించి అద్యాయనం చేసింది..అవినీతి గురించి జరిగిన ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్న అతిషి..కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించాక పార్టీ లో చేరారు..అప్పటినుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు అంచెలంచెలుగా ఎదిగి ఇఫ్పుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరింది..ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి అతిషి ఎనలేని కృషి చేసింది..
ఆమ్ ఆద్మీ పార్టీలో సలహాదారు పదవి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన అతిశీ.. చిన్న వయసులోనే అత్యధిక శాఖలు నిర్వహించిన మహిళగా పేరు పొందారు..ఆప్ వ్యవస్థాపక సభ్యులలో ఒక్కరిగా పార్టీ విధివిధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఆమె.. 2013లో ఆప్ పార్టీ లో చేరిన అతిశీ అదే యేడాది పార్టీ ప్రణాళిక ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా చోటు దక్కించుకున్నారు..2019లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నుంచి పోటీ చేసి క్రికెటర్ గౌతమ్ గంబీర్ చేతిలో ఓటమి పాలయ్యారు..తరువాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి గెలుపొందారు. గతేడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టైన నేపత్యంలో ఆమె మంత్రి పదవి చేపట్టారు..అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టిన ఆతిశీ.. సీఎం కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఏకతాటిపై నిలిపి పార్టీకి అండగా నిలబడ్డారు…
త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అతిషి డిల్లీలో మూడో మహిళా సీఎంగా, అతి చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోయే రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు..తనకు ముఖ్యమంత్రి పదవి రావడం పట్ల అతిషి ఆనందం వ్యక్తం చేశారు,,తన గురువు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె తెలిపారు..వచ్చే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి ని చేయడమే తన లక్ష్యమని అతిషి పేర్కొన్నారు..