Trending Now
Monday, November 18, 2024

Buy now

Trending Now

మా ఆర్మీలో భారతీయులు ఉండాలనుకోలేదు: రష్యా

ఢిల్లీ: భారతీయ పౌరులు రష్యా దేశ సైన్యంలో భాగం కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్‌  బాబుష్కిన్‌ అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బుధవారం బాబుష్కిన్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతీయ పౌరులు రష్యా సైన్యంలో భాగం కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. ఏజెంట్లు మోసం చేయటం వల్ల కొంత మంది టూరిస్టు విసాలపై వచ్చి రష్యా  ఆర్మీలో చేరుతున్నారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొని చర్యలు తీసుకుంటాం.  ఈ వ్యహారంపై భారత్, రష్యా  ఒకే ఆలోచనతో ఉంది. అందుకే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనుకోవటం లేదు.

మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా సైన్యంలో భారత పౌరులు భాగంకావాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు రష్యా అధికారులు సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. చాలా మంది భారతీ పౌరులు కేవలం డబ్బుల కోసమే రష్యా ఆర్మీలో చేరుతన్నారు. అలాంటి వారిని మేము ఎట్టిపరిస్థితుల్లో కూడా చేర్చుకోము. కేవలం 50 నుంచి 100 మంది భారతీయులు మాత్రమే రష్యా సైన్యంలో ఉన్నారు. ఇది అంత ప్రభావం చూపే విషయం కాదు.  రష్యా ఆర్మీలో సహయకులుగా చేరుతున్న పలువురు భారతీయులకు సరైన విసాలు కూడా లేవు. చాలా వరకు వారంతా టూరిస్ట్‌ వీసా మీద రష్యాకు వస్తున్నారు ’’ అని అన్నారు.

Related Articles

Stay Connected

58,755FansLike
85,858FollowersFollow
155,575SubscribersSubscribe

Most Popular