తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. 2023-24 ఏడాదిలో సింగరేణికి 2వేల388 కోట్ల రూపాయల లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు 788 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం బోనస్ గా ప్రకటించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సగటున ఒక్కో కార్మికుడికి 1లక్షా 90 వేలు బోనస్ గా వస్తుందన్నారు…కార్మికులతో పాటు సింగరేణిలో ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి 5 వేల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు..
గత ఏడాది కంటే 20 వేల రూపాయలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది… సింగరేణిలో మొత్తం 41,837 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు. వీరితోపాటు కాంట్రాక్ట్ వర్కర్లుగా 25వేల మంది పనిచేస్తున్నారు..
భూపాలపల్లి ఏరియాలో 5400 మంది ఉద్యోగులు సింగరేణి సంస్థలో పనిచేస్తు్న్నారు..వంద మాస్టర్లు నిండనివారికి లాభాల్లో బోనస్ చెల్లించవద్దనే నిబందన ఉంది..ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 200 మంది వంద మాస్టర్లు నిండని వారు ఉన్నారు..దీంతో భూపాలపల్లిలో దాదాపు 5200 మంది ఉద్యోగులు బోనస్ ను పొందనున్నారు..కాంట్రాక్ట్ కార్మికులకు 5 వేలు బోనస్ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది..దీంతో భూపాలపల్లి ఏరియాలో 800 మంది కాంట్రాక్టర్ కార్మికులు లబ్ది పొందనున్నారు..