స్థానికులు,స్థానికేతరులు ఇప్పుడు ఈ అంశమే కన్నడ చిత్ర పరిశ్రమను ఇబ్బందుల్లో పెట్టింది..లోకల్ సినిమాకు థియేటర్ లు ఇవ్వకుండా తమిళ సినీ హీరో చిత్రానికి ఎక్కువ థియేటర్ లు ఇవ్వడం పట్ల కన్నడ సినిమా ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు..
అసలు గొడవకు మూల కారణం గోట్ మూవీ..తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ నటించిన సినిమా..ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మూవీ,ఫస్ట్ రోజు మంచి టాక్ తెచుకున్నప్పటికి తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు..
ఇదే సమయంలో ‘ఇబ్బని తబ్బిత ఇల్లెయాలి’ అనే కన్నడ సినిమా రిలీజైంది.చార్లి 999, కిరిక్ పార్టీ లాంటి సినిమాలతో కన్నడనాట మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే అందించిన మూవీ ఇది..చంద్రజీత్ బెల్లప్ప డైరెక్షన్ లో విహాన్ గౌడ, అంకిత అమర్ జంటగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రానికి సూపర్ టాక్ వచ్చింది..కానీ గోట్ సినిమాకు ఎక్కువ ధియేటర్ లు ఇచ్చి కన్నడ మూవీకి ఇవ్వకపోవడంతో అక్కడి సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
మా బాషా చిత్రాలను వేయకుండా వేరే ప్రాంత చిత్రాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు..కన్నడ మూవీలకు థియేటర్లు దొరకవని, తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు ఇక్కడి ధియేటర్ ల ఓనర్లు పెద్ద పీట వేస్తున్నారని, వీటి వల్ల కన్నడ సినిమాలు దెబ్బ తింటున్నాయని ఇక్కడి సినీ జనాలు ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు..