వైద్యురాలి పై కోల్ కతా లో జరిగిన హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ ఒక్క సంఘటన తో మహిళ ల రక్షణ పై ప్రత్యేక చట్టాలు తెచ్చి కఠిన శిక్షలు అమలుచేయాలని నిరసనలు జరిగాయి..ఏదైన భయానక ఘటనలు జరిగినప్పుడే అందరూ ఖండించి మళ్ళీ మరిచిపోవడం ప్రజలందరికీ అలవాటుగా మారింది..ఇప్పటికి దేశంలో ఏదో ఒక చోట మహిళల పై చిన్నారుల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి..తాజాగా బుధవారం బీహార్ లో నర్స్ పై జరిగిన ఘటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చలకు దారితీసింది.
బీహార్ లోని ఓ ప్రైవేట్ హస్పిటల్ లో నర్స్ పై తోటి డాక్టర్లు సామూహిక హత్యాచారం చేయాలని చూసిన ఘటన వెలుగులోకి వచ్చింది…బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా గంగాపూర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ఒక వైద్యుడు ఇద్దరు సహచరులతో కలసి నర్స్ పై అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించారు..మద్యం మత్తులో ముగ్గురు కలసి నర్స్ ను బలవంతం చేయబోయారు..దీంతో నర్స్ వాళ్ల ప్రయత్నాలను ప్రతిఘటించింది..ఆ సమయంలో చేతికి దొరికిన సర్జికల్ బ్లేడ్ తో ఆ కీచక డాక్టర్ మర్మాంగాన్ని కోసేసింది..వెంటనే ప్రాణాలను కాపాడుకొని ఓ చోట దాక్కొని పోలీసులకు సమాచారం అందించింది..
బాధితురాలు ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు..ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని,అక్కడ ఉన్న ఆధారాలను సేకరించారు..ఓ పక్క మహిళల రక్షణ,భద్రత పై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న,వారి పై దాడులు మాత్రం ఆగడం లేదు..బీహార్ లో జరిగిన ఘటన తో మరోసారి మహిళల రక్షణ కు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తుంది..