కరీనా కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన నటి. ప్తనకంటూ ప్రత్యేక గుర్తింపు తో వరస హిట్ల తో బీ టౌన్ లో రారాణి గా వెలుగొందింది..ఓ పక్క కపూర్ ల బ్యాక్ రౌండ్, మరో పక్క హిరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేసింది..చేతినిండా సినిమాలు ఉన్న టైం లొనే హీరో సైఫ్ అలీఖాన్ తో ప్రేమలో పడింది..కరీనా కు ఇది మొదటి వివాహం కాగా సైఫ్ అలీఖాన్ కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు..మొదటి భార్య తో విడాకులు తీసుకున్నాక కరీనాను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు..
పెళ్లి జరిగాక మూవీ ఫీల్డ్ కు దాదాపు దూరమైంది కరీనా..కుటుంబ బాద్యతలకు విలువ నిచ్చి సినీ ఇండిస్ట్రీ కి దూరంగా ఉన్న కరీనా,ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుంది.కథానాయికగా మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తు మళ్లీ వెండితెర పై తళుక్కుమంటుంది..ఈ సంవత్సరం ఒక్క సినిమాలోనే నటించిన కరీనా ఏకంగా రూ.20 కోట్లు పన్ను చెల్లించడం టాక్ ఆఫ్ ద టౌన్ అయింది..ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ లలో ఆమెనే మొదటి స్థానంలో ఉంది..
సినీ కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయిన శ్రద్ధ పెట్టి సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది…సినిమాలే కాకుండా తను ఓ సొంత బ్రాండ్ కూడా కలిగి ఉందట..కొన్ని నివేదికల ప్రకారం కరీనా ఈ యేడు రూ.20 కోట్ల పన్ను చెల్లించందట…కేవలం సినిమాలే కాకుండా బిజినెస్, బ్రాండ్ ప్రమోషన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తుంది ఈ హీరోయిన్.. దీంతో హీరోయిన్ లలో ఎక్కువ టాక్స్ పే చేసిన లిస్ట్ లో ఫస్ట్ ఉంది.. కరీనా తర్వాత అత్యధిక పన్ను చెల్లించిన హీరోయిన్ లలో కియారా అద్వానీ, కత్రినా కైఫ్ తర్వాత స్థానాలలో ఉన్నారట..