ఇద్దరు మైనర్లే..18 ఏళ్ళ అమ్మాయికి,19 సంవత్సరాలు అబ్బాయికి..సోషల్ మీడియా లో పరిచయం..ఆ పై చిగురించిన ప్రేమ..ఇంకేముంది, లోకంతో పనేముంది అనుకుంది యువతి..అనుకున్నదే తడవుగా అబ్బాయితో వెళ్ళిపోయింది..సీన్ కట్ చేస్తే హోటల్ రూమ్ లో 20 రోజులు ఆ అబ్బాయితో నరక యాతన అనుభవించింది..శారీరకంగా,మానసికంగా
ఇబ్బంది పడింది..
నిజామాబాద్ జిల్లా బైంసా కు చెందిన మైనర్ బాలికకు,మహబూబ్ నగర్‌కు చెందిన 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థికి రెండేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది.పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.. దీంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని, తనతో వచ్చేయమని, మాయ మాటలు చెప్పి బాలిక ను హైదరాబాద్ నారాయణ గూడలోని ఓయో హోటల్ కు తీసుకెళ్లాడు..
ఆగస్టు 16వ తేదీ నుండి 20 రోజుల పాటు హోటల్ లో ఉంచి నరకయాతన పెట్టాడు.. 20 రోజుల పాటు హోటల్ రూంలో బంధించి..తన లైంగిక వాంఛ తీర్చుకుని చివరకు పరారయ్యాడు. బాలిక తన తల్లిదండ్రులకు లైవ్ లోకేషన్ పంపి విషయం చెప్పడం తో వారు షీ టీం కు ఫిర్యాదు చేశారు… వెంటనే షీటీమ్ బాధితురాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు..బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్టు చేసి..రిమాండుకు తరలించారు పోలీసులు..