మంచు ఫ్యామిలీ లో విభేదాలు ఉన్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి..ముక్యంగా అన్నదమ్ములైన మంచు మనోజ్,విష్ణు మధ్య సయోధ్య లేదనే ఆరోపణలు ఉన్నాయి..అన్నదమ్ముల తీరు కూడా ఈ ఆరోపణలు నిజమే అన్న సందేహాలను కలిగిస్తున్నాయి..
తిరుపతి లో ఉన్న మంచు మోహన్ బాబు యూనివర్సిటీ లో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి..యూనివర్సిటీలో ఫీజుల వసూలు మోహన్ బాబు కు నెగిటివ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి..MBU యూనివర్సిటీలో ఫీజులు, ఇతర ఛార్జీలు ఓ రేంజ్లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి..
మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. అయితే ఆయన యూనివర్శిటీ మాత్రం క్రమశిక్షణతో మెలగడం లేదన్నది అక్కడ చదవుతున్న విద్యార్థుల వెర్షన్. దీంతో అక్కడ ఆందోళనలు కూడా జరుగుతున్నాయ్..ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ.. AICTEకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ రాసింది..యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు, బిల్డింగ్ ఫీజులు, IT ఫీజులు వసూలు చేస్తున్నారంటు పేరెంట్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది.. డేస్ స్కాలర్స్ కూడా మధ్యాహ్న భోజనం మెస్‌లో తినాలని కండిషన్ పెట్టారంట..ఇప్పుడు ఈ నిబంధనలకు వ్యతిరేకంగా మోహన్ బాబు యూనివర్సిటీ లో ఆందోళనలు జరుగుతున్నాయి..
ఈ అంశంపై మంచు మనోజ్ స్పందించిన తీరు భిన్నంగా ఉంది..నాన్న గారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఆందోళనకు ఎక్స్ వేదికగా ఆయన మద్దతు ప్రకటించారు..విద్యార్థులు, తల్లిదండ్రులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ మనోజ్ పేర్కొన్నారు..అయితే మంచు మనోజ్..యూనివర్సిటీ వివాదం పై స్పందించిన తీరు మరోసారి అన్న దమ్ముల మధ్య వివాదాలను తేటతెల్లం చేస్తున్నాయంటూ మాటలు వినిపిస్తున్నాయి..మోహన్ బాబు యూనివర్శిటీ, శ్రీవిద్యానికేతన్ సంస్థలు మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి..
తమ విద్యాసంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన మంచు మనోజ్.. అలా చేయకుండా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు మద్దతు తెలపడంతో ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనే చర్చ నడుస్తోంది..